ఏపిలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు

అమరావతి: రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జిఒ జారీ చేసింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తింపచేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. నిబంధనల సరళతరంతో ఎక్కువమంది అగ్రవర్ణ పేదలకు మేలు జరగనున్నది. కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తింప చేశారు. మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయపరిమితి పెంచారు. రూ.6లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ, గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా మెమో విడుదల చేశారు. రాష్ట్రంలోని తహశీల్దార్‌ కార్యాలయాలకు మెమోద్వారా అధికారిక సమాచారం పంపించారు. రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.