స్కాలర్ షిప్ లకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి : డీఐఈఓ

కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా లోని ప్రభుత్వ , ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అడ్మీషన్ పొంది స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆధార్ అథెంటికేషన్ తప్పక పూర్తి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం గత 4 సం.లు గా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వివరాలకు కళాశాలల యాజమాన్యాలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. కళాశాలల్లో పెండింగ్ చూపిస్తున్న విద్యార్థుల ఆధార్ అథెంటికేషన్, బార్ కోడ్ ప్రింట్ లను యస్సీ, యస్టి, బీసీ, మైనారిటీ జిల్లా శాఖాధిపతులకు అందజేయాలని అన్నారు. కళాశాలల స్కాలర్ షిప్ ఈ-పాస్ telanganaepass.cgg.gov.in లాగిన్ లలో పెండింగ్ చూపిస్తున్న వాటన్నింటినీ వెంటనే సంబంధిత శాఖలకు ఫార్వర్డ్ చేయించాలని సూచించారు. కరోనా కారణంగా గత విద్యా సం.లో చాల మంది విద్యార్థులు హార్డ్ కాపీలు సమర్పించలేదని, వాటన్నింటినీ సమర్పించేందుకు కళాశాలల్లో అధ్యాపకులచే కమిటీలు / వాట్సప్ గ్రూపులు ఏర్పర్చి పరిష్కరించాలని అన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.