వినయ్ గార్డెన్ వెళ్లేరోడ్డు కు దివంగత బుచ్చి లింగం మర్గ్ గా నామకరణo
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఈరోజు దివంగత శ్రీ బుచ్చి లింగం గారి 58 వ జయంతి ని పురస్కరించుకొని కాగజ్ నగర్ మున్సిపల్ కు సంబంధించిన , వినయ్ గార్డెన్ వెళ్లేరోడ్డు కు దివంగత బుచ్చి లింగం మర్గ్ గా నామకరణo చేసి, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వీరితోపాటు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాసం శ్రీనివాస్ గారు,మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాసకొండ గిరిష్ గారు,కాగజ్ నగర్ CI మోహన్ గారు, మునిసిపల్ కమిషనర్ సివి. రాజు గారు, పద్మశాలి సంఘం నాయకులు అలాగే టిడిపి ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్, బుచ్చిలింగం గారి కుటుంబ సభ్యులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్