మున్సిపల్ వైస్ చైర్మన్ గా 8వ వార్డు కౌన్సిలర్ దివ్వకళ
రైతు బాంధవులు, ఎమ్మిగనూరు శాసన సభ్యులు “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” గారి ఆశీస్సులతో మరియు మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” ఆశీర్వదంతో ఈరోజు 8వ వార్డు కౌన్సిలర్ దివ్వకళ గారిని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికోవడం జరిగింది. ఈసందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో ఆర్డీవో రామక్రిష్ణారెడి ఆద్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దివ్వకళ గారిని ఎన్నుకున్నారు. అనంతరం మన ప్రియతమ నాయకులు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు పూల గుచ్చి తో అభినందించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు గారు, వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్ గారు, మున్సిపల్ కమిషనర్ ఎం. క్రిష్ణా గారు, డిఈఈ లు వేంకటేశ్వర్లు గారు, రమేష్ గారు, మనోహర్ రెడ్డి, గారు ఆర్ఓ మంజునాథ్ గౌడ్ గారు, టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మోహన్ గారు, మరియు మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, అనంతరం నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగనన్న గారికి మర్యాద పూర్వకంగా కలసి గజామాల వేసి కృతజ్ఞతలు తెలిరజేసిన దేవా రాజ్ గారు, సునీల్ కుమార్ గారు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.