బాలాభారతి స్కూల్ కి 10లక్షల రూపాయలు విరాలమిచ్చిన కర్నూలు ఎన్నారై ఫౌండేషన్…!!!

కర్నూలు జిల్లా,ఓర్వకల్ మండలంలోని పొదుపులక్ష్మి ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలాభారతి పాఠశాల కు వరుసగా రెండో ఏడాది 10 లక్షల రూపాయల విరాళమిచ్చిన కర్నూలు ఫౌండేషన్ వారు…మన ప్రియతమ నాయకులు,పాణ్యం ఎమ్యెల్యే, శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కర్నూలు ఫౌండేషన్ వారు ఇచ్చిన 10 లక్షల రూపాయల చెక్కును బాలాభారతి స్కూల్ వ్యవస్థాపకురాలు విజయభారతి గారికి అందజేశారు..అనాథ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యానందించాలనే లక్ష్యంతో ఈ సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు కర్నూలు NRI ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి పొట్లూరి…ఎలాంటి లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి ఉన్నత విద్యనందిస్తున్న బాలభారతి పాఠశాల కు భవిష్యత్తు లో కూడా ఇలానే తమవంతు సహకరిస్తామని అన్నారు…ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ వారిని అభినందించారు ఎమ్యెల్యే శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు…ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి.

Leave A Reply

Your email address will not be published.