బంగారంతో టాయిలెట్.. బయట పడ్డ బండారం..!
లంచం వ్యవస్థకు పట్టిన ఓ చీడ.పురుగు పట్టిన చెట్టు క్షీణించనట్టే..అవినీతి వల్ల పేదవాడు..మరింత పేదరికం లోకి జారుకుంటాడు.రోజంతా కష్టపడితే పూట గడిచే బతుకులు ఓ వైపు..బల్ల కింద చేతులు పెట్టి కోట్లకు పడిగెత్తే వారు మరోవైపు.ఈ డబ్బు మనుషుల మధ్య ఎన్నో వ్యత్యాసాలను సృష్టిస్తుంది. మాస్కో: రష్యాలో ఓ ట్రాఫిక్ పోలీసు అధికారిపై అవినీతి ఆరోపలు వచ్చాయి.దీనిపై పరిశోధన చేపట్టిన రష్యా అధికారులకు విస్తుపోయే అనుభవం ఎదురైనది. పోలీసు అధికారి అవినీతి సొమ్ముతో ఏకంగా గోల్డెన్ టాయిలెట్‌ను కట్టించాడు. వివరాల్లోకి వెళితే..రష్యాలోని దక్షిణ స్టావ్రోపోల్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసు అధికారి కల్ అలెక్సీ సఫోనోవ్.. వ్యాపారాలకు నకిలీ అనుమతులు జారీ చేసినందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.దీనిపై రష్యా అధికారులు విచారణ చేపట్టారు.అతడితో పాటు మరో 35 మంది అధికారులు ఓ ‘మాఫియా ముఠా’ నడుపుతున్నట్లు గుర్తించారు. అయితే అవినీతి అధికారి ఇంటికి సంబంధించిన ఫోటోలు,సీసీ ఫుటేజ్ వీడియో లీక్ అయ్యాయి.ఈ వీడియోలో ఓ పెద్ద భవనంలో విలాసవంతమైన గదులు, అతి ఖరీదైన వస్తువులతో అలంకరణలు,బిలియర్డ్స్ హాల్ నిర్మించారు.