ఫ్యాప్టో ధర్నాలను విజయవంతం చేయాలని మాట్లాడుతున్న డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి గురుగుబెల్లి గోపాలరావు…

శ్రీకాకుళం, పొందూరు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ శుక్రవారం అనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని పాత తాలూకా కేంద్రాల ఎదుట జరుపతలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి గురుగుబెల్లి గోపాలరావు అన్నారు. ఈరోజు పొందూరు మండలం తాడివలస ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సిపియస్ రద్దు, పిఆర్సీ అమలు, డిఏ బకాయిలు చెల్లించాలని, కరోనా కారణంగా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ధర్నాలకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పూజారి హరిప్రసన్న, ఉపాధ్యాయులు రాంబాబు, సరస్వతి, సాయికుమార్, పాపారావు, అప్పలనరశింహులు తదితరులు పాల్గొన్నారు.

గురుగుబెల్లి వెంకటరావు, ప్రజానేత్ర – రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.