పూల వ్యాపారి హోసన్నా ఆశ్రమానికి సహాయం
పట్టణంలోని వైయస్ నగర్ నందుగల హోసన్నా వృద్ధాశ్రమానికి డోన్ పాత బస్టాండ్ లో లలిత చిన్న పూల అంగడి పెట్టుకుని వచ్చిన ఆదాయంలో ప్రతిరోజు కొంత చిల్లర పక్కకి పెట్టి చేసిన పొదుపు తో ఆశ్రమానికి 1 నెలసరిపడు సరుకులు పంపిణీ చేశారు.జాన్ ప్రభాకర్ మాట్లాడుతూ దళిత పూల వ్యాపారం చేసుకుంటూ ఆశ్రమానికి సహాయం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని, డబ్బు హోదా ఉన్న అనేక మంది ఉన్నా వ్యాపారం చేసుకుంటూ సహాయం చేయగల దయా గుణం ఉండడం గొప్ప విషయం అన్నారు. హోసన్నా ఆశ్రమానికి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని కోరుతున్నాను అని అన్నారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి