తెలంగాణ పోలీసుల విజ్ఞప్తికి ఓకే చెప్పిన గూగుల్… లోన్ యాప్ లపై వేటు

ఇటీవల ఆన్ లైన్ రుణాల యాప్ ల కారణంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలను తెలంగాణ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి ఆయా యాప్ ల బాధ్యులను అరెస్ట్ చేశారు. అంతేకాదు, రుణాలు తీసుకున్నవారి పట్ల దారుణమైన రీతిలో వేధింపులకు పాల్పడుతున్న 450 లోన్ యాప్ లపై చర్యలు తీసుకోవాలంటూ గూగుల్ ను కోరారు. ఈ మేరకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసులు గూగుల్ కు లేఖ రాశారు.

ఈ లేఖపై సానుకూల రీతిలో స్పందించిన గూగుల్… ప్లే స్టోర్ నుంచి 200 లోన్ యాప్ లను తొలగించింది. ఇంకా మరికొన్ని యాప్ లు ఉన్నాయని, వాటిపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులు గూగుల్ ను కోరారు. కాగా లోన్ యాప్ కేసుల్లో పలువురు చైనీయులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల మేర నగదును స్వాధీనం చేసుకున్నారు. వందల సంఖ్యలో బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.

Leave A Reply

Your email address will not be published.