పట్టపగలు డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్.. చేసింది అతనేనా
అనంతపురంలోని ఆజాద్ నగర్ లో పట్టపగలు అందరూ చూస్తుండగానే.. ఒక విద్యార్థిని కిడ్నాప్ గురైంది. ఈ సంఘటన నగరంలో సంచలనం రేపింది. అనంతపురంలోని 6వ రోడ్డుకు చెందిన భాస్కర్ కుమార్తె జ్యోతికి కొన్ని రోజుల క్రితం బనగానపల్లిలో కానిస్టేబుల్ గా పని చేసే భగీరథతో పెళ్లి నిశ్చయమైంది. అయితే కానిస్టేబుల్ కు అంతకు ముందే పెళ్లి అయిందన్న బంధువులు చెప్పడంతో వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అప్పట్లో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అయితే ఇవాళ జ్యోతి ఆజాద్ నగర్ లో కిడ్నాప్ కు గురి కావడానికి..భగీరథే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఇదే విషయాన్ని చెప్పారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.