గుడిలో కూడా వదలరా.. కసాపురంలో ఏం జరిగింది
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం.. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే అన్ని చోట్ల లంచాలు తీసుకునే సంస్కృతి ఉన్న నేటి సమాజంలో ఆలయాన్ని కూడా వదల్లేదు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రధాన అర్చకుని స్థానంలో ఆయన కుమారున్ని నియమించడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే ఇందుకు ఒకటిన్నర లక్షల లంచం డిమాండ్ చేశారు… ఆలయ అధికారులు. లంచం ఇవ్వడం ఇష్టం లేని అర్చుకుని కుమారుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు లంచం ఇస్తుండగా.. సీనియర్ అసిస్టెంట్ ను పట్టుకున్నారు. అయితే దీని వెనుక ఈఓ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.