లోకేష్ పర్యటనకు కౌంటర్ గానే కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టారా.

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు పంట నష్టపోతే.. ప్రభుత్వం వద్ద కనీస సమాచారం కూడా లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. అర్.బి.కెలు అద్భుతంగా పని చేస్తున్నాయని సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఊదరగొడుతున్నారని.. కాని అలాంటి పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఎక్కడా లేదన్నారు. కనీసం రైతులను ఎవరూ పరామర్శించిన పాపాన పోలేదన్నారు. అందుకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రైతులను పరామర్శించేందుకు అనంతపురం జిల్లా వస్తున్నారని చెప్పారు. అయితే లోకేష్ పర్యటన సమయంలోనే జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లాలో ఎంత మంది పంటలు వేశారు.. ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు సాగయ్యాయి… వర్షం ఏ ప్రాంతంలో ఎంత వచ్చింది.. ఎంత మేర పంట నష్టపోయిందన్న లెక్కలతో సహా కలెక్టర్ వివరించారు. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు కూడా పంపామని చెప్పారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించి లెక్కలు వివరించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ కి జగన్ సర్కార్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చిందని.. తమ వద్ద లెక్కలు పక్కాగా ఉన్నాయన్న సంకేతం పంపారని అంటున్నారు…

 

 

Leave A Reply

Your email address will not be published.