రణమా, శరణమా, రాజీనామానో తేల్చుకోవాలి.. సీఎం జగన్ కు తులసీ రెడ్డి సవాల్
సీఎం జగన్ వద్ద పోలవరం విషయంలో మూడే మార్గాలు ఉన్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి అన్నారు. కేంద్రంపై రణానికైనా దిగాలని.. లేదా శరణమైన విషయం ప్రజలకు చెప్పాలని.. లేదంటే రాజీనామా చేసి తప్పుకోవాలని సూచించారు. ప్రధాని మంత్రి మోదీ శనిగ్రహం అయితే చంద్రబాబు రాహువు, జగన్ కేతువులని తులసీరెడ్డి అన్నారు. కేంద్రంపై పోరాటం అంటే.. సీఎం జగన్ కు శశికలే గుర్తుకొస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు వ్యవసాయం గురించి రైతుల పరిస్థితి తెలియదని.. ఆయన పక్కా వ్యాపారి అని కామెంట్ చేశారు.