మానవత్వం ఉందా.. చచ్చిపోయిందా… దివ్యాంగుని వేదన
* మానవత్వం ఉందా.. చచ్చిపోయిందా
* అటెండర్ ఉద్యోగం కోసం.. ఒక దివ్యాంగుని వేదన
* ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ నిరీక్షణ
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చాపట్ల గ్రామానికి చెందిన గంగన్న ఒక దివ్యాంగుని వేదనకు అంతే లేకుండా పోయింది. గంగన్నకు పుట్టినప్పటి నుంచి చూపు లేదు. వంద శాతం బ్లైండ్ అని వైద్యులు ధృవీకరించారు. పదవ తరగతి పూర్తి చేసిన గంగన్న.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అధికారం ఉద్యోగం ఇస్తామంటూ కాల్ లెటర్ పంపడం.. తీరా ఉద్యోగం కోసం వెళ్లిన తరువాత ఏదో ఒక కారణం చెప్పి వెనక్కు తిప్పి పంపుతున్నారు. ఇలా గత కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఉద్యోగం కోసం కాల్ లెటర్ అధికారులు పంపితే… ఎన్నో ఇబ్బందులు పడుతూ కలెక్టర్ కార్యాలయానికి వస్తే.. వెనక్కు తిప్పి పంపుతున్నారని గంగన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనీసం దివ్యాంగుడన్న కనికరం లేకుండా మాట్లాడుతున్నారని గంగన్న వాపోతున్నాడు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గంధం చంద్రుడు అయినా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]