బీసీలకు ఎప్పుడైనా ఇలా చేశారా

బ్యాక్ వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్ బోన్

బీసీలను గతంలో ఉన్న ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ గా చూస్తే సీఎం జగన్ బీసీలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారని మంత్రి శంకరనారాయణ అన్నారు. బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ అనంతపురం వైసీపీ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర చేపట్టారు. బీసీ కులాల నాయకులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్ని కులాలను గౌరవిస్తూ సీఎం జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. 2కోట్ల 70లక్షలపైగా ఉన్న బీసీలకు 33వేల కోట్లమేర సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ఇన్ని చేస్తున్నా..విమర్శలు చేస్తున్న వారు గతంలో ఏం చేశారో గుర్తుచేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదని.. బ్యాక్ బోన్ అని అన్నారు. దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదని…. ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.