ఎక్కడ కరోనా ఎఫెక్ట్.. దసరాకి కోట్లలో బిజినెస్
కరోనా ఎఫెక్ట్ తో ఇప్పట్లో కోలుకోలేం.. అన్ని రంగాల పై తీవ్ర ప్రభావం పడింది.. చాలా మందికి ఉపాధి పోయింది. సామాన్యుని జీవితం దుర్భరమైంది. ఇది నిన్నటి వరకు అందరూ చెప్పిన మాటలు. అది నిజం కూడా. కాని దసరాలో ఇందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపించింది. దసరా పండుగకు షాపింగ్ మాల్స్ కిక్కిరిసాయి. అసలు రోడ్లలో పట్టనంత జనం వచ్చారు. ఏ దుకాణం చూసిన ఫుల్ బిజినెస్ తో కళకళలాడింది. సామాన్యుని వద్ద నుంచి ధనికులు వరకు అంతా షాపింగ్ లో మునిగిపోయారు. ఈ బిజినెస్ ముందుగా వస్త్ర దుకాణాలదే టాప్. ఇక రెండవది సెల్ ఫోన్ షాప్స్. చాలా మంది సెల్ ఫోన్లు కొనేందుకు ఉత్సాహం చూపించారు. ఒక్కో దుకాణంలో లక్షల్లో బిజినెస్ జరిగింది. మూడవది ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్. వీటి ధరలు అధికంగా ఉన్నా.. ఆఫర్లు ప్రకటించడంతో జనం క్యూ కట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆన్ లైన్ షాపింగ్. ఆన్ లైన్ షాపింగ్ లో జరిగిన బిజినెస్ అంతా ఇంతా కాదు. చాలా మంది ఇంట్లో నుంచే బిజినెస్ చేశారు. గతంలో జరిగిన దసరా కంటే ఈ సారి పండుగ హడావుడిగా ఉండటానికి కారణం… కరోనా సమయంలో పండుగలు ఏవీ సరిగా జరగలేదు. అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన ఉగాది, వినాయక చవితికి కూడా ఎలాంటి సందడి లేదు. అందుకే దసరాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు.. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో కూడా కోట్లలో బిజినెస్ జరిగింది.