హిందుత్త్వం పై తెలంగాణ సర్కారు పక్షపాత ధోరణి…

సీఎం కేసీఆర్‌ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం డేగ కన్ను వేసింది. సమయం కోసం ఎదురు చూస్తున్నాం.. పూర్తి ఆధారాలతో ఆయన్ను జైలుకు పంపుతాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచుతూ కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని, కమీషన్ల కోసం కొన్ని కంపెనీలకు దాసోహమైందని ఆరోపించారు. రంజాన్‌ సందర్భంగా కరోనా కేసులు తగ్గించి చూపిన ప్రభుత్వం.. గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా కరోనా కేసులు పెరిగాయని చెప్పడం హిందూ సమాజంపై జరుగుతున్న కుట్రేనని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడే గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించుకుంటామని చెప్పినా.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం విధించారని విమర్శించారు. కరోనా కేసులు పెరిగాయంటూ మూడు రోజులుగా విగ్రహాల నిమజ్జనాలను కూడా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రంజాన్‌ నెలలో కరోనా కేసులను ఎందుకు తగ్గించే ప్రయత్నం చేశారో.. నవరాత్రి ఉత్సవాల వేళ కేసులు పెరిగాయంటూ భయభ్రాంతులకు గురి చేసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారో.. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రంజాన్‌ నెలలో తగ్గిన కొవిడ్‌ కేసులు.. గణేశ్‌ ఉత్సవాల సమయంలో పెరిగాయా? సీఎం కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం డేగకన్ను సమయం కోసం ఎదురు చూస్తున్నాం ఆధారాలతో ఆయన్ను జైలుకు పంపుతాం కరోనా కట్టడిలో రాష్ట్ర సర్కారు విఫలమైంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌

Leave A Reply

Your email address will not be published.