యువకులు ను టార్గెట్ చేసిన కి లేడీ.!

ఆమె పేరు స్వప్న.. మోసాలు చేయడం ఆమె నైజం. ఉన్నత వర్గానికి చెందిన యువతి ని అని, ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకుంటూ.. మ్యారేజ్‌ బ్యూరోలో పెళ్లికాని యువకులను టార్గెట్‌ చే స్తుంది. మెల్లగా ముగ్గులోకి దించి వారిని పెళ్లి చేసుకుంటుంది. ఆపై వారిని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు కాజేసి వేరే ప్రాంతానికి చెక్కేస్తుంది. ఇటీవల ప్రకాశం జి ల్లాలో ఇలాగే ఓ యువకుడిని మోసం చేసి పెళ్లి చేసుకుం ది. అతని నుంచి భారీగా డబ్బు గుంజేందుకు పోలీస్‌ కే సుపెట్టి హడావిడి చేసింది. కానీ.. సీన్‌ రివర్స్‌ అయి కిలా డి లేడీ అసలు గుట్లు బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెంది న స్వప్న అలియాస్‌ హరిణి డిగ్రీ చదువుకొంది. అనంత రం మేనమామను వివాహం చేసుకుంది. తర్వాత ఆయన తో విడిపోయింది. అప్పటి నుంచి మ్యారేజ్‌ బ్యూరో వెబ్‌సైట్‌లో పెళ్లికాని యువకులకు గాలం వేయడం ప్రారంభించింది. తప్పుడు పేరు, అడ్ర్‌సతో నమ్మబలికింది. అలా తిరుపతికి చెందిన పృథ్వీరాజ్‌ను మోసం చేసి వివాహం చేసుకొంది. తర్వాత అతడిని బెదిరించి డబ్బులు కాజేసిం ది. అనంతరం మ్యారేజ్‌ బ్యూరో ద్వారా ప్రకాశం జిల్లా వీరేపల్లికి చెందిన విప్పర్ల రామాంజనేయులును తనకు పెళ్లికాలేదని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకొంది. కొద్దినెలల తర్వాత విషయం తెలిసి రామాంజనేయులు ఆమెను ఇక్కడే వదిలేసి ఉద్యోగ నిమిత్తం డెన్మార్క్‌ వెళ్లారు. కాగా, కొద్దిరోజుల క్రితం స్వప్న దొనకొండ వచ్చింది. రామాంజనేయులు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ దొనకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ.. విచారణలో స్వప్న ఇప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకున్న విషయం బయటపడింది. రామాంజనేయులు డెన్మార్క్‌ వెళ్లిన తర్వాత కూడా ఆమె మరో యువకుడిని పెళ్లి చేసుకున్నటు వెల్లడైంది. స్వప్న హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటున్న సమయంలో తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన పతంగి స్వప్న అనే మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె సర్టిఫికెట్లు తీసుకొని ట్యాంపరింగ్‌ చేసింది. తిరుపతిలో తమిళ యువతికి, హైదరాబాద్‌లో సిరి అనే మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసింది. ఇటీవల తిరుపతిలో వేదవిద్య నేర్చుకుంటున్న దీపక్‌శుక్లా అనే మహారాష్ట్ర వ్యక్తినిల పెళ్లి చేసుకుం ది. ఆ తర్వాత అతడిని బెదిరించి డబ్బులు తీసుకొని పరారైంది. స్వప్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.