అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల నిరసన

అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు నిరసనకు దిగారు. మూడు రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. విధులను బహిష్కరించి నర్సింగ్ ఆఫీసర్లు నిరసన తెలియజేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికలకు ముందు సీఎం జగన్ హామీ ఇచ్చారని... ఆయన తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.