తాడేపల్లి రాజప్రాసాదం వీడి ప్రజల కష్టాలు తెలుసుకోండి జగన్ గారూ!: దేవినేని ఉమ
మద్యం అమ్మకాల అంశం ఏపీలో అధికార, విపక్షాల మధ్య మరింత ఆజ్యం పోసింది. నిన్నటినుంచి విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. సీఎం జగన్ తాడేపల్లి రాజప్రాసాదం వీడి ప్రజల కష్టాలు తెలుసుకోవాలని హితవు పలికారు. లాక్ డౌన్ వల్ల పనులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సంపద సృష్టించడం చేతకాని ప్రభుత్వం విద్యుత్ చార్జీలు, మద్యం అమ్మకాల ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచి ఆదాయం రాబట్టుకోవాలనుకుంటోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు సీఎం అనుభవలేమికి నిదర్శనాలని ట్వీట్ చేశారు.
Tags: Devineni Uma,Jagan,Andhra Pradesh,Liquor Sales,Lockdown,Corona Virus